సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కరోనాతో బాధపడుతున్న వారికి ముక్తా ఫౌండేషన్, వేములవాడ పట్టణాభివృద్ధి సంక్షేమ సమితి ఆధ్వర్యంలో మంగళవారం 50 కిట్లను పంపిణీ చేశామని అధ్యక్షుడు ఈశ్వరిగారి రమణ తెలిపారు. బాధితులకు ఈ కిట్టు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 14 రోజులకు సరిపడా మందులు ఉంటాయని పేర్కొన్నారు. అవసరమైనవారు శ్రీనివాస్ ఫోన్ నం.09248061 999 కు సంప్రదించాలని సూచించారు.
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా మహమ్మారి నియంత్రణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న బాధితులకు ఇంటివద్దకే ‘ఐసొలేషన్ కిట్’ను సరఫరా చేయాలని నిర్ణయించింది. చికిత్సకు అవసరమైన ఔషధాలు, మాస్క్‌లు, శానిటైజర్లను సర్కారే ఉచితంగా సమకూర్చనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 10వేల మందికి పైగా ఇళ్లలోనే చికిత్స పొందుతున్నారు. వీరిలో తొలుత ఎలాంటి లక్షణాలు లేకపోయినా.. రెండు మూడు రోజులు గడిచే సరికి జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు […]