జెనీవా: సుమారు పది నెలలుగా ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనాయే చివరి మహమ్మారి కాదని, భవిష్యత్తులో మరిన్ని రోగాలు వచ్చే అవకాశం లేకపోలేదని డబ్ల్యుహెచ్వో హెచ్చరించింది. ఈ మేరకు జెనీవాలో జరిగిన ఒక కార్యక్రమంలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రస్ అధనోమ్ మాట్లాడుతూ.. ‘ఇదే చివరి మహమ్మారి కాదు. వైరస్ వ్యాప్తిలు, మహమ్మారులు మన జీవితంలో భాగమని చరిత్ర చెబుతోంది. కానీ తరువాత రాబోయే మహమ్మారిని ఎదుర్కోవడానికి ఈ ప్రపంచం సర్వసన్నద్ధంగా ఉండాలి. ఇటీవల చాలా దేశాలు వైద్యం, […]