కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలోకి వచ్చి తర్వాత డైరెక్టర్, యాక్టర్ గా తనకంటూ ఓ స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు రాఘవ లారెన్స్. సినిమాల్లో గుర్తింపే కాదు రాఘవ లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ద్వారా వైద్యసేవలు, ఉచిత విద్యాసేవలు ఇలా ఎంతో మంది చిన్నారులకు ఎన్నో రకాలుగా సాయపడి మనవతా థృక్పథాన్ని చాటుకున్న మహామనిషిగా మన్ననలు అందుకుంటున్నాడు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా లారెన్స్తీసుకున్న నిర్ణయం అటు కోలీవుడ్, టాలీవుడ్ లో సంచలనాత్మకంగా మారింది. తమిళనాడులో రానున్న ఎన్నికల్లో సూపర్ స్టార్ రజినీ […]