సారథి న్యూస్, శ్రీశైలం(కర్నూలు): లోకకల్యాణార్థం శ్రీశైలం భ్రమరాంబదేవి అమ్మవారికి శుక్రవారం సాయంత్రం ఆలయంలో ఊయల సేవ నిర్వహించినట్లు ఈవో రామారావు తెలిపారు. ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూలనక్షత్రం రోజున అమ్మవారికి ఊయల సేవ నిర్వహిస్తామని తెలిపారు. అంతకుముందు అర్చకులు మహాగణపతి పూజ నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ, సహస్త్ర నామపూజలు జరిపించినట్లు ఈవో రామారావు వెల్లడించారు.