సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గ పరిధిలోని చందుర్తి మండలం బండపల్లిలో రంజాన్ పండగ సందర్భంగా ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కేసీఆర్ రంజాన్ కానుకను ప్రజాప్రతినిధులు, నాయకులు గురువారం అందజేశారు. బండపల్లిలో స్థానిక సర్పంచ్ న్యాయ విజయ జార్జ్ ఆధ్వర్యంలో వాటిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కాసారపు గంగాధర్ గౌడ్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు మల్యాల గంగానర్సయ్య, వార్డు సభ్యులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి, టెంపుల్ చైర్మన్ గడ్డం సంజీవరెడ్డి, ముస్లింలు పాల్గొన్నారు.