తెలుగు రాష్ట్రాల్లో ఏ విచిత్ర సంఘటన జరిగినా ఒక్కసారి అంతా ఓ 400 ఏళ్ల పైచిలుకు కాలానికి వెళ్లి అది అప్పుడే బ్రహ్మంగారు చెప్పారంటూ కథలుగా, వింతలుగా చెప్పుకోవడం సర్వసాధారణం. ఇక ఆయన పేరిట పల్లెపట్టణాలు, తెలుగు లోగిళ్లలోనూ అనేక తత్వాలు ప్రాచుర్యంలో ఉండీ ముఖ్యంగా సన్యాసం తీసుకున్న వారు పాడుతుండడం ఏళ్లతరబడి సాగుతున్న సంప్రదాయమే. అసలు విషయానికి వస్తే పోతులూరు వీరబ్రహ్మేంద్రుల వారిని ఒక మత సిద్ధాంతవేత్తగానో, ఆధ్యాత్మికవాదిగానో చూసే కంటే ఆయన జీవితంలోని ఆటుపోట్లు […]