సారథి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుందని మాజీ మంత్రి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన సుజాతనగర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేంద్రరావు, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీరహనుమంతరావు, ఎంపీపీ శ్రీమతి విజయలక్ష్మి, సొసైటీ వైస్ చైర్మన్ జగన్, ఎంపీటీసీ శోభారాణి పాల్గొన్నారు.