సారథి న్యూస్, కర్నూలు: ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ కరోనాను తరిమికొట్టాని కర్నూలు ట్రాఫిక్ డీఎస్పీ మహబూబ్‌బాష ఆటోడ్రైవర్లకు సూచించారు. గురువారం నగరంలోని సుంకేసుల రోడ్డు నేతాజీ టాకీస్ వద్ద రోజా కమ్యూనిటీ రీసోర్స్పర్సన్ సుమత ఏర్పాటుచేసిన ‘కరోనా ఆటోడ్రైవర్స్ జాగ్రత్తలు’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటోడ్రైవర్లకు సూచనలు, సలహాలు ఇచ్చారు. మాస్క్ లేనిదే ప్రయాణికులను ఆటోల్లో ఎక్కువ మందిని ఎక్కించుకోకూడదని, డ్రైవర్లు కూడా కట్టుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా వేడి నీరు తాగాలని చెప్పారు. వైరస్‌ను తరిమికొట్టడమే […]