సారథి న్యూస్, శ్రీకాకుళం: ప్రభుత్వ భవనాల్లోనే అంగన్వాడీ సెంటర్లు ఉండాలని, అందుకు ‘నాడు..నేడు’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహిళాశిశు సంక్షేమశాఖ, ఐసీడీఎస్ పథక సంచాలకులు డాక్టర్జి.జయలక్ష్మి సీడీపీవోలను ఆదేశించారు. శనివారం ఉదయం ఆమె సమీక్షించారు. అంగన్వాడీ సెంటర్లకు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి నివేదిక తమకు అందిస్తే వాటిని జేసీకి పంపిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న భవనాల మరమ్మతులకు సంబంధించి అంచనాల వివరాలను తమకు పంపించాలని సూచించారు.