బంగాళాఖాతంలో సూపర్ సైక్లోన్ గా తుఫాన్ ఒడిశా, బెంగాల్ ప్రభుత్వాలు అలర్ట్ సాయంత్రం ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష దిల్లీ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఎంఫాన్ అతి తీవ్ర తుఫాన్‌గా కొనసాగుతోంది. ప్రస్తుతం పారాదీప్‌కు దక్షిణంగా 780 కి.మీలు, బెంగాల్‌లోని దిఘాకు 930 కి.మీల దూరంలో కేంద్రీకృతమైన ఈ పెను తుఫాన్ సోమవారం సాయంత్రానికి సూపర్ సైక్లోన్‌గా మారే అవకాశం ఉందని హోంమంత్రిత్వశాఖ తెలిపింది. ఈ తుఫాన్ తీవ్రతపై సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. […]