సారథి న్యూస్, బెజ్జంకి: సిద్దిపేట జిల్లా అల్వాల్ గ్రామ శివారులో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా సిద్దిపేట, అల్వాల్ వైపునకు వెళ్లే రోడ్డును దుబ్బాక సీఐ హరికృష్ణ గౌడ్, మిరుదొడ్డి ఎస్సై శ్రీనివాస్ తాత్కాలికంగా మూసివేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పారుతున్నందున ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం గ్రామాల సర్పంచ్లు, రెవెన్యూ అధికారులతో ప్రతిరోజు మాట్లాడుతున్నామని వివరించారు.