సారథి న్యూస్, చేవెళ్ల: ఉరుముల, మెరుపులతో భారీవర్షం పడడంతో పిడుగు పడి ఎద్దు మృతిచెందిన సంఘటన చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు మొగులయ్య కాడెద్దులను పొలంలో కట్టేశాడు. శుక్రవారం సాయంత్రం వర్షం కురవడంతో పిడుగు పాటుకు ఎద్దు చనిపోయింది. తనను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు.