Breaking News

ALAMPUR

జోగుళాంబకు రూ.55.68లక్షల ఆదాయం

సారథి న్యూస్​, అలంపూర్​: జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపురం పుణ్యక్షేత్రమైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల హుండీలను ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరాజు పర్యవేక్షణలో మంగళవారం లెక్కించారు. హుండీలో రెండు యూఎస్​ డాలర్లు, ఐదు యూరోలు లభించాయి. వీటితో పాటు అమ్మవారి ఆలయంలో 62.800 మి.గ్రా. మిశ్రమ బంగారం, 620 మి.గ్రా మిశ్రమ వెండి వచ్చింది. బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో 110మి.గ్రా. మిశ్రమ వెండి, ఒక యూఎస్​ డాలర్ వచ్చింది. అన్నదాన సత్రం హుండీ ద్వారా రూ.65,463 […]

Read More

అలంపురం.. దివ్యధామం

తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠం అలంపూర్‌ జోగుళాంబ ఆలయం. ఇది గద్వాల పట్టణానికి 55 కి.మీ., కర్నూలు జిల్లా కేంద్రానికి 20 కి.మీ. చేరువలో ఉంది. ఇక్కడి శిల్పసౌందర్యాన్ని వీక్షించడానికి దేశవిదేశాల నుంచి అధిక సంఖ్యలో వస్తుంటారు. అన్ని క్షేత్రాలు, ఆలయాలకు సంప్రదాయాలకు భిన్నంగా షణ్మతాలకు నిలయంగా అలంపురం విరాజిల్లుతోంది. ఈ క్షేత్రం దక్షిణకాశీ, పర శురామ క్షేత్రం, భాస్కర క్షేత్రంగా భాసిల్లుతోంది. ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా అలంపూరంలో నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మదేవుడికి […]

Read More
కరోనా కట్టడికి చర్యలు

కరోనా కట్టడికి చర్యలు

సారథి న్యూస్​, అలంపూర్: కరోనా నివారణ చర్యల్లో భాగంగా బుధవారం అలంపూర్ మున్సిపాలిటీలో డ్రోన్​ సాయంతో సోడియం హైపో ద్రావకాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్​ వెంకటేశ్​ మాట్లాడుతూ.. ప్రతివార్డులో 20 లీటర్ల చొప్పున పది వార్డులకు రెండొందల లీటర్ల ద్రావకాన్ని పిచికారీ చేయిస్తున్నట్టు వివరించారు. అందుకోసం రోజుకు రూ.20వేలు ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి, కౌన్సిలర్ సుష్మారావు, అల్లాబకాష్, సమీర్, గంగిరెడ్డి, శేఖర్ పాల్గొన్నారు.

Read More