అఖిల్ అక్కినేని చిన్నప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హ్యట్ పెట్టుకుని చేతిలో గన్ తో కౌ బాయ్ గెటప్ లో ఉన్న ఆ ఫొటో ఒకటి ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఈ ఫొటోకు ఓ నేపథ్యం ఉంది. 2002లో మహేశ్‌బాబు టక్కరిదొంగ అనే కౌ బాయ్ సినిమా చేశాడు. ఆ సినిమా ప్లాప్ అయింది అది వేరే విషయం. అయితే అప్పట్లో మూవీ సెట్‌కు వెళ్లిన అఖిల్.. కౌ బాయ్ గెటప్‌లో సరదాగా […]
అక్కినేని అఖిల్‌కు టైం కలిసిరావడం లేదు. ఈ యువ హీరో నటించిన తొలి మూడు చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దీంతో వెబ్‌సీరీస్‌లో నటించేందుకు అఖిల్ సిద్ధమవతున్నట్టు టాక్. ‘అఖిల్’ ‘హలో’ ‘మిస్టర్ మజ్ను’ ఈ మూడు చిత్రాలు అఖిల్ ను నిరాశపరిచాయి. అయినప్పటికీ నటుడిగా కొంతమేర గుర్తింపు పొందాడు. డాన్సులు, ఫైట్ సీన్లలో ఎంతో బాగా చేస్తున్నాడని అక్కినేని అభిమానులు ప్రశంసలు గుప్పించారు. కానీ నటనలో కొంత పరిణతి సాధించాలని సినీ విమర్శకుల సూచన. ఈ […]
ఇప్పటికే అలవైకుంఠపురంలో చిత్రంలో పూజా హెగ్డే తన కాళ్ల అందాలతో యువతను కట్టిపడేసిన విషయం తెలిసిందే. ఆమె కాళ్ల అందానికి చిత్రపరిశ్రమలోని దర్శకులందరూ పడిపోయినట్టున్నారు. తాజాగా అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ వాస్ తన జిఎ 2 పతాకంపై నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్లోనూ పూజ తన కాళ్లతో అఖిల్ చెవులను టచ్చేస్తుంది. ఈ […]
ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ‘లవ్ స్టోరీ’తో బిజీగా ఉన్నాడు నాగచైతన్య. ఈ సినిమా తర్వాత ‘మనం’ ఫేమ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్‌తో కలిసి పనిచేయనున్నాడట. అయితే ఈ సినిమా కూడా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీయేనట. ఈ సినిమా విక్రమ్ కుమార్ మాట్లాడుతూ.. ‘చైతుతో తీస్తున్న ఈ చిత్రం హర్రర్ థ్రిల్లర్ కాదు.. రొమాన్స్, కామెడీ కలయికలో రానున్న ఆరోగ్యకరమైన ఫుల్ ఎంటర్టైనర్’అని అన్నారు. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి […]
వీవీ వినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు అక్కినేని అఖిల్. ఆ చిత్రంతో మాస్ హీరోగా ఎలివేట్ అయినా తరువాత చేసిన సినిమాలు లవ్ ఎంటర్ టెయినర్సే. అఖిల్ తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ సినిమా కూడా పూర్తి స్థాయి లవ్ ఎంటర్ టైనర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో వస్తున్న ఈ చిత్రంలో అఖిల్ ఎన్నారై యువకుడిగా కనిపించబోతున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా ఇంకా కంప్లీట్ అవక ముందే […]
బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ మనవరాలైన సాయేషా సైగల్ ‘అఖిల్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు రాలేదు. తర్వాత బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ సరసన ‘శివాయ్’ మూవీలో నటించింది. ఆ తర్వాత కోలీవుడ్ కు వెళ్లి అక్కడ చాలా తమిళ సినిమాల్లో నటించింది. కోలీవుడ్ స్టార్ హీరో ఆర్యను గతేడాది వివాహం చేసుకుంది. హీరోయిన్గా కోలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్న […]