Breaking News

AJAY PUVVADA

సంతోష్​ త్యాగం మరువలేనిది

సారథిన్యూస్​, ఖమ్మం: భారత్​-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన కల్నల్​ సంతోష్​బాబు త్యాగం మరువలేనిదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఖమ్మం జెడ్పీ సమావేశమందిరంలో సంతోష్​బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అజయ్​ మాట్లాడుతూ.. సంతోష్​బాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More