కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇక థియేటర్లు తెరిచే చాన్స్ లేకపోవడంతో యువదర్శకులంతా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ల వైపు పరుగులు తీస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి యువ దర్శకుడు అనిల్ రావిపూడి చేరిపోయారు. అల్లు అరవింద్ ప్రారంభించిన డిజిటల్ యాప్ ఆహా కోసం అనిల్ రావిపూడి ఓ కామెడీ వెబ్‌సీరిస్‌ను తెరకెక్కించబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్తనటీనటులతో ఈ వెబ్‌సీరిస్‌ను ప్లాన్ చేయబోతున్నట్టు సమాచారం. మరో పక్క అనీల్ ‘ఎఫ్3’ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్నాడు. కరోనా ప్రభావం […]