సారథి, రామడుగు: భారత మిస్సైల్స్ టెక్నాలజీ పితామహుడు, భారతరత్న, దివంగత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ మహోన్నత వ్యక్తి అని విద్యావంతుల వేదిక సభ్యులు కొనియాడారు. మంగళవారం ఆయన వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని గ్రంథాలయం పక్కన రామడుగు విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలామ్ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. కలామ్ ఆశయ సాధనకు యువత పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జక్కుల శ్రీను, […]