Breaking News

TELANGANA

ఆగస్టు నాటికి పేదలకు డబుల్ ఇళ్లు

మున్సిపల్​శాఖ మంత్రి కేటీఆర్​ సారథి న్యూస్​, హైదరాబాద్​: ఈ ఏడాది ఆగస్టు నాటికి హైదరాబాద్ నగరంలో 50వేల మంది పేదలకు డబుల్ బెడ్ రూమ్​ ఇళ్లను పంపిణీ చేస్తామని మున్సిపల్ ​శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో గృహ నిర్మాణశాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన ఇళ్ల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలోనే […]

Read More
కరోనాతో ముగ్గురు మృతి

కరోనాతో ముగ్గురు మృతి

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ వైద్యారోగ్యశాఖ కరోనా హెల్త్​ బులిటెన్​ను గురువారం సాయంత్రం విడుదల చేసింది. ఇవాళ కొత్తగా 22 పాజిటివ్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. కరోనాతో ఒకరోజే ముగ్గురు మృతిచెందగా, ఇప్పటి వరకు 28 చనిపోయినట్లు ప్రకటించింది. తాజాగా 33 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్​ అయ్యారని, ఇప్పటి వరకు 442 మంది కోలుకున్నారని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1038 కరోనా పాజిటివ్​ కేసులు నమోదైనట్లు వెల్లడించింది.

Read More
విద్యాసాగర్​ రావు సేవలు చిరస్మరణీయం..

విద్యాసాగర్​ రావు సేవలు చిరస్మరణీయం

సారథి న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రానికి తెలంగాణ జల వైతాళికుడు ఆర్.విద్యాసాగర్ రావు సేవలు ఎప్పటికీ మరువలేనివని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు గుర్తుచేశారు. బుధవారం విద్యాసాగర్​ రావు మూడవ వర్ధంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య పాలనలో సాగునీటి రంగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటిన మహనీయుడని కొనియాడారు. కృష్ణా, గోదావరి జలాల్లో  తెలంగాణ కోల్పోయిన ప్రతి నీటిబొట్టును లెక్కగట్టిన గొప్ప జలనిపుణుడని, చివరి శ్వాసవరకు తెలంగాణ సాగు నీటి రంగానికి […]

Read More
రైతు గుండెల్లో 'పిడుగు'

రైతు గుండెల్లో ‘పిడుగు’

సారథి న్యూస్, రామడుగు, మహబూబ్ నగర్: రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల మంగళవారం సాయంత్రం అకాలవర్షం రైతన్నలను ఆగమాగం చేసింది. చేతికొచ్చిన పంట నీటిపాలైంది. మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన ధాన్యం తడిసి పోయింది. అలాగే పిడుగు పాటు వణికించింది. కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం నీట తడిసి ముద్దయింది. ఆరబోసిన ధాన్యం సైతం కొట్టుకుపోయింది. పొలాల్లో కోతలకు ఉన్న వరి నేలకొరిగింది. […]

Read More
తెలంగాణలో 7 పాజిటివ్

తెలంగాణలో 7 పాజిటివ్

సారథి న్యూస్, రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో శనివారం ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఉదయం ఆరు కాగా, సాయంత్రం ఒకటి చొప్పున కేసు నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 25 మంది చనిపోయారని పేర్కొంది. 307 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ఇప్పటి వరకు 990 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

Read More