సామాజిక సారథి, పెద్దశంకరంపేట: ఢిల్లీలోని ముఖ్యమంత్రి రెసిడెంట్ భవనంలో నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాలకు వరప్రదాయిని అయిన బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలపై ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు బీబీ పాటిల్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి, ఆందోల్, జహీరాబాద్ శాసనసభ్యులు సి.క్రాంతికిరణ్, మానిక్ రావు పాల్గొన్నారు.