న్యూఢిల్లీ: ఫామ్ లేకపోవడం, సరైన బ్యాటింగ్ స్థానం దొరకపోవడంతో 2007లోనే దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ కెరీర్ గుడ్ బై చెప్పాలనుకున్నాడని టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ వెల్లడించాడు. అప్పటికే తీవ్ర అసంతృప్తిలో ఉన్న మాస్టర్‌కు వన్డే ప్రపంచకప్ నుంచి భారత్ లీగ్ దశ నుంచి నిష్ర్కమించడం మరింత భారంగా మారిందన్నాడు. ‘నేను బాధ్యతలు చేపట్టేనాటికి భారత జట్టులో పరిస్థితులు బాగాలేవు. వాటిని అధిగమించడానికి కాస్త సమయం పట్టింది. కానీ అప్పటికే ప్రయోగాల వల్ల ఆటగాళ్లంతా […]