సారథి న్యూస్, ఖమ్మం: భారత్-చైనా సరిహద్దులో గల గాల్వన్ లోయలో ఇరుదేశాల సైనికుల ఘర్షణలో వీరమరణం చెందిన తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన ఆర్మీ అధికారి కల్నల్ సంతోష్ బాబుకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గురువారం సత్తుపల్లిలో కొవ్వొత్తిని వెలిగించి నివాళులు అర్పించారు. వీర మరణం చెందిన సంతోష్ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు.