సారథి న్యూస్, మానవపాడు: అయోధ్య నిధి సమర్పణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చెన్నిపాడు గ్రామంలో రాముడి ప్రతిమతో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. జనహిత, హిందువాహిని ఆధ్వర్యంలో కోలాటాలు వేశారు. నృత్యాలు చేశారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆద్యంతం ఊరేగింపు కన్నులపండుగా సాగింది. ఎన్నో ఏళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల చిరకాల నిరీక్షణ సఫలమై భవ్య రామ మందిర నిర్మాణం అవుతున్నందున అందరూ తమవంతు సహాయ సహకారాలు అందజేశారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి, […]