సారథి న్యూస్, హుస్నాబాద్: ఈత సరదా ఇద్దరి నిండు ప్రాణాలను బలితీసుకుంది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం గ్రామంలో చోటుచేసుకుంది. ఏసీపీ మహేందర్ కథనం.. బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన పొన్నాల అనిల్ (17), మానకొండూరు మండలం రంగంపేటకు చెందిన నంగునూరు కుమార్(18) బంధువుల ఇంటికి వచ్చారు. శనివారం ఉదయం కోహడ మండలం శనిగరం ప్రాజెక్టులో ఈత కొట్టేందుకు వెళ్లి ఊపిరాడక చనిపోయారు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ తెలిపారు.