సారథి న్యూస్, రామడుగు: చైనా శత్రుమూకల దాడిలో అసువులు బాసిన వీర జవానులకు కరీంనగర్ జిల్లా రామడుగు విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అమర జవానుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు.