సామాజిక సారథి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ జీవిత చరిత్ర ఆధారంగా విడుదలైన నయీమ్ డైరీస్ సినిమాను తెలంగాణ ఉద్యమకారులు అడ్డుకున్నారు. సినిమాలో తెలంగాణ ఉద్యమకారిని బెల్లి లలితను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో సంధ్య థియేటర్ వద్ద తెలంగాణ ఉద్యమకారులు ఆందోళనకు దిగారు. నయీమ్ డైరీస్ సినిమా పోస్టర్ ఫ్లెక్సీలను చించివేసి దహనం చేశారు. సినిమాను సంధ్య 35 ఎం.ఎం థియేటర్‌లో విడుదల కాకుండా అడ్డుకున్నారు. ఈ సినిమాను బ్యాన్ […]