ఇప్పటివరకు నటించిన చిత్రాల్లో గ్లామర్ పాత్రలతో అలరించిన హెబ్బాపటేల్ ఈసారి డీ గ్లామరస్క్యారెక్టర్ లో కనిపించనుంది. క్రైమ్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాలో చక్కనైన చీరకట్టుతో పల్లెటూరి మహిళ రాధ పాత్రను పోషించింది. దీపావళి సందర్భంగా ఆమె పాత్రకు సంబంధించిన లుక్ ను విడుదల చేసింది మూవీ టీమ్. పల్లెటూరులో ఇంటి బయట కూర్చుని చేటలో బియ్యం ఏరుతున్న సాధారణ మహిళగా కనిపిస్తున్న హెబ్బా లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ […]