న్యూఢిల్లీ: ఏటా ఒడిశాలో ఎంతో వైభవంగా జరిగే పూరీ జగన్నాథ రథ యాత్రకు ఈ సారి బ్రేక్ పడింది. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో యాత్రను నిలిపేయాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రథయాత్ర నిర్వహించడం కరెక్ట్ కాదని చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బోబ్డే అన్నారు. ‘ఈ పరిస్థితుల్లో రథయాత్ర నిర్వహిస్తే పూరీ జగన్నాథుడు మనల్ని క్షమించరు” అని ఆయన కామెంట్ చేశారు. ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకుని రథయాత్రను నిలిపేస్తున్నట్లు అన్నారు. ఏర్పాట్లను […]