శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రజౌరి జిల్లా సందర్‌బన్‌లో గురువారం అర్ధరాత్రి పాకిస్తాన్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఒక సైనికుడు అమరుడయ్యాడు. పాకిస్తాన్ ఆర్మీ రాత్రి 10 :45 గంటలకు ఒక్కసారిగా కాల్పులకు దిగిందని అధికారులు చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందానికి పదే పదే తూట్లు పొడుస్తున్న పాకిస్తాన్ పూంచ్ జిల్లాల్లో కూడా కాల్పులు జరిపినట్లు ఆర్మీ అధికారులు చెప్పారు. లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలోని కిర్నీ సెక్టార్‌లో మోర్టార్‌లతో దాడి చేశారని, మన ఆర్మీ వారిని సమర్థంగా తిప్పికొట్టిందని […]