సారథి న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సోమవారం కొత్తగా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 16 మందిని డిశ్చార్జ్ చేయగా ఇప్పటివరకు 332 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. తెలంగాణలో 1,003 కేసులు నమోదు కాగా 646 యాక్టివ్ గా ఉన్నట్లు ప్రకటించింది.