సారథి న్యూస్, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లాలో ఖాళీగా ఉన్న 9 పంచాయతీ కార్యదర్శి పోస్టులు(రెగ్యులర్, జూనియర్) తాత్కాలిక ప్రాతిపదికన మెరిట్ లిస్ట్ నుంచి ఎంపిక చేసేందుకు ధ్రువీకరణ పత్రాలను ఈనెల 6న ఉదయం10.30 గంటలకు జిల్లా పంచాయతీ ఆఫీసులో పరిశీలిస్తామని కలెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు. ఈ మేరకు మెరిట్ లిస్టును 1:3 నిష్పత్తిలో జిల్లా పంచాయతీ ఆఫీసులో నోటీస్ బోర్డులో ప్రదర్శించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.