సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాయాలను కాగిత రహిత(ఈ ఆఫీస్) ఆఫీసులుగా మార్చాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ సూచించారు. శనివారం కలెక్టరేట్ లో ఈఆఫీస్ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని పనులకు పేపర్లను వినియోగిస్తున్నామని చెప్పారు. మెదక్ కలెక్టరేట్‌ను ఈఆఫీస్ గా మార్చామన్నారు. ఈసేవ, మీ సేవ తరహాలోనే వీటిని నిర్వహించాలన్నారు. అధికారులు సంతకాలను సైతం డిజిటల్ సిగ్నేచర్ కీ (డీఎస్కీ) తయారు చేయించాలని, ఏదైనా […]