సారథి న్యూస్, ఎల్బీనగర్: మూసినది ప్రక్షాళనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి స్పష్టంచేశారు. గురువారం ఉదయం నాగోల్ బ్రిడ్జి ప్రక్కన పరీవాహక ప్రాంతంలో అధికారులతో కలిసి పర్యటించారు. మూసినది చుట్టూ నీళ్లు నిరంతరం ప్రవహించే విధంగా ఛానెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. చెరువు చుట్టుపక్కల పెరిగిన పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం తొలగించాలని, చెరువు నందు మొలిచిన గుఱ్ఱపు డెక్కను కూడా వెంటనే తొలగించాలన్నారు. మూసినది […]