ముంబై: కరోనా కేసులతో సతమతమవుతూ.. నిసర్గ తుపానుతో అతలాకుతలమైన ముంబై ప్రజలకు ఇప్పుడు మరో కొత్త ఇబ్బంది వచ్చి పడింది. శనివారం రాత్రి నుంచి చాలా చోట్ల దుర్వాసన వస్తుండటంతో జనమంతా భయం గుప్పిట్లో బతుకుతున్నారు. బృహన్ ముంబై కార్పొరేషన్ పరిధిలోని చింబూర్, ఘట్‌కోపర్, కంజూర్‌మార్గ్, విక్రోలీ, పొవై, అంధేరీ, మన్‌కుర్ద్ ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి వాసన వస్తోందని ప్రజలు చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది వాసన ఎక్కడ నుంచి వస్తుందనే విషయంపై […]