సారథి న్యూస్, హుస్నాబాద్: విప్లవ రచయితల సంఘం నేత ప్రముఖ న్యాయవాది వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపె మల్లేష్ అన్నారు. ఈ సందర్భంగా టౌన్ లోని అనభేరి, సింగిరెడ్డి భూపతిరెడ్డి అమరుల భవనంలో సోమవారం ఆయన విలేకరులతో ప్రెస్ మీట్ లో మాట్లాడారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రొఫెసర్ సాయిబాబా, వరవరరావును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపడం సరికాదన్నారు. ప్రపంచ మహమ్మారి కరోనా […]
సారథి న్యూస్, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలం కుర్నపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు నిషేధిత మావోయిస్ట్ పార్టీ కమిటీ సభ్యులను ఆదివారం గ్రామస్తులు స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట సరెండర్ చేయించారు. వారిలో కోరం నాగేశ్వర్రావు, కొమరం రమేష్ , సొందే రమేష్, కోరం సత్యం, ఇర్పా వెంకటేశ్వర్లు, వాగే కన్నారావు ఉన్నారు. ఇకపై మావోయిస్టులకు సహకరించేది లేదని గ్రామస్తులంతా స్వచ్ఛందంగా తీర్మానం చేశారు.
అటవీ అధికారి అరెస్టు సారథి న్యూస్, కొత్తగూడెం: మావోయిస్టులకు నగదు తీసుకెళ్తున్నారనే కారణంతో గురువారం పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.ఆరులక్షల వసూలు చేసి కారులో తీసుకెళ్తుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నల్లబెల్లి వద్ద పోలీసుల తనిఖీచేసి పట్టుకున్నారు. నిందితుల్లో భద్రాచలం అటవీశాఖ బీట్ ఆఫీసర్ మరకం వీరేందర్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పాల్వంచకు చెందిన బండి వెంకటేశ్వర్లు, ఆలపాటి ప్రసాద్ ను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.ఆరు […]