సారథి న్యూస్, మహబూబ్ నగర్ : మహిళా స్వయం సహాయక సంఘాలకు కోవిడ్-19 అత్యవసర తత్కాల్ రుణ సహాయం అందించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు ఆయా బ్యాంకుల మేనేజర్లను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ లోని రెవెన్యూ సమావేశ మందిరంలో బ్యాంకుల మేనేజర్లు, వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కరోనా కారణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా మారిందని, స్వయం సహాయక సంఘాల సభ్యులు ఇబ్బంది పడకుండా నేరుగా […]