సారథి, అచ్చంపేట: మహబూబాబాద్ జిల్లాలో గిరిజన బాలికపై అత్యాచారం, హత్యచేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్ర ఈశ్వర్ లాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబానికి తక్షణం ఆదుకోవాలని కోరారు. ఆదివారం అయన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని గిరిజన భవన్ లో మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ మండలం ధర్మరాంతండాకు చెందిన గిరిజన బాలిక ఉషను కిరాతకంగా హత్యచేశారని, నిందితులను వెంటనే […]