సారథి న్యూస్, వరంగల్: వరంగల్ పోలీస్ కమినషరేట్‌లోని మట్వాడ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో చనిపోయిన కానిస్టేబుల్ కె.సదానందం సతీమణి రమాదేవికి వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ చేయూత పథకం కింద రూ.లక్షన్నర చెక్కును శుక్రవారం అందజేశారు. కానిస్టేబుల్ కుటుంబ స్థితిపరిస్థితులను కమిషనర్ అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వపరం అందాల్సిన బెనిఫిట్స్‌ను తక్షణమే అందేలా చూడాలని పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్‌కుమార్ గౌడ్‌కు సూచించారు.