సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న భ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం మహాన్యాస పూజలు నిర్వహించారు. అక్షయ తృతీయ సందర్భంగా ఏకాదశ రుద్రాభిషేక సహిత అష్టోత్తర శత(108) కలశాలతో అభిషేకం నిర్వహించారు. గంటంబొట్ల రాజేశ్వరశర్మ ఆధ్వర్యంలో ఉమాశంకర్ శర్మ, మురళిశర్మ, రవిప్రసాద్ శర్మ , సుహాస్, వృశిష్ పాల్గొన్నారు.