సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మేమున్నామని నిరూపించారు. పేద వధువుకు ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రానికి చెందిన సుశీలమ్మ మనవరాలు పెళ్లి ఖర్చుల కోసం సంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ సమాజసేవా సంస్థ తరఫున వ్యవస్థాపక అధ్యక్షుడు సురేష్ జ్యోషి సహకారంతో బ్రాహ్మణ సమాజసేవా సంస్థ మండలాధ్యక్షుడు రామచంద్రాచారి రూ.21వేలు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు రూ.11వేల ఆర్థిక సహాయాన్ని మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ నియోజకవర్గం అధ్యక్షుడు కిషన్‌రావు దేశ్‌పాండే, జిల్లా […]