సామాజిక సారథి, నాగర్కర్నూల్ ప్రతినిధి: ఇటీవల కన్నుమూసిన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కు చెందిన సీనియర్ న్యాయవాది బాలీశ్వరయ్య కుటుంబాన్ని రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ అనంత నరసింహరెడ్డి బుధవారం సాయంత్రం పరామర్శించారు. బాలీశ్వరయ్య న్యాయవాద వృత్తికి చేసిన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని కొనియాడారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని 50ఏళ్ల పాటు న్యాయరంగానికి ఆయన అందించిన సేవలు ప్రజలకు గుర్తుండిపోతాయన్నారు. న్యాయవాద వృత్తికి వన్నెతెచ్చిన మహానుభావుడని స్మరించుకున్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాలీశ్వరయ్య […]