సారథి న్యూస్, కంగ్టి, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని చాప్టా(కే)గ్రామంలో నూతనంగా నిర్మించిన బారడీ పోచమ్మ ఆలయంలో సోమవారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మధ్యాహ్నం విగ్రహాన్ని ప్రతిష్టించి నైవేద్యం పెట్టి, సాయంత్రం బోనాలు సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఎడ్ల బండ్లను ముస్తాబుచేసి ఊరేగింపుగా ఊరు శివారులో ఉన్న బారడీ పోచమ్మ మందిరం వరకు తీసుకెళ్లి ప్రదక్షిణలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం అన్నదానం ఉంటుందని, భక్తులు తరలొచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.