సారథి, కొల్లాపూర్: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కొల్లాపూర్ పట్టణంలో జిల్లా అడిషనల్కలెక్టర్ మనుచౌదరి, చైర్మన్ రఘుప్రోలు విజయలక్ష్మి, చంద్రశేఖరాచారి శుక్రవారం పట్టణంలోని 20వ వార్డులో మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు. పట్టణ ప్రగతి పనులపై ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వైద్యసిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
సారథి న్యూస్, రామగుండం: పట్టణాల పారిశుద్ధ్యమే ముఖ్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం ఆయన రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 30వ డివిజన్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రధాన కాల్వల క్లీనింగ్‌ను పరిశీలించారు. వర్షాకాలంలో సీజనల్ వాధ్యులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఆయన వెంట రామగుండం కార్పొరేషన్ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, నారాయణదాసు, మారుతి, ఇరుగురాళ్ల శ్రావణ్, బూరుగు వంశీకృష్ణ, […]
సారథి న్యూస్, రామగుండం: కార్పొరేషన్ లోని ప్రతి డివిజన్లో ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనులను పూర్తిచేస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం పట్టణ ప్రగతిలో భాగంగా 37, 46వ డివిజన్ లో పర్యటించారు. ఇంటిలో వాడిన నీటిని డ్రైనేజీల్లోకి వెళ్లేలా చూసుకోవాలని సూచించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అంతకుముందు రామగుండం కార్పొరేషన్ ఆఫీసు ఆవరణ, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే […]