కరోనా ప్రభావమే కారణం అవసరాన్ని సొమ్ముచేసుకుంటున్న వ్యాపారులు సారథి, రాయికల్: కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తోంది. కొందరు వైరస్ బారినపడి మృత్యువాతపడగా మరికొందరు మెల్లమెల్లగా కోలుకుంటున్నారు.ఈ సమయంలో వైద్యులు, నిపుణులు పండ్లను అధికంగా తినడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుందని సూచిస్తున్నారు. తద్వారా వైరస్ నశించిపోతుందని చెబుతున్నారు. వ్యాధి బారినపడిన పేదలు త్వరగా కోలుకోవాలనే తపనతో పండ్లను కొని తిందామంటే వాటి ధరలకు రెక్కలు వచ్చాయి. రెక్కాడితేనే డొక్కాడని పరిస్థితుల్లో పండ్లను కొనుగోలుచేసి తినే పరిస్థితి […]