సారథి న్యూస్, మహబూబ్నగర్: మహబూబ్ నగర్ మున్సిపాలిటీలోని రాజేంద్రనగర్ లో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సోమవారం పర్యటించారు. కరోనా వైరస్ నేపత్యంలో ప్రజలెవరూ బయటి రాకూడదని సూచించారు. కోవిడ్ బారినపడకూడదని కోరారు. స్థానిక నిర్మల్ డయాగ్నస్టిక్స్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు నిత్యావసర సరుకులు, పండ్లను మంత్రి పంపిణీ చేశారు.