సారథి న్యూస్, బిజినేపల్లి: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఎంపీడీవో ఆఫీసు ఎదుట ధర్నానిర్వహించిన అనంతరం ఎంపీవోకు వినతిపత్రం అందజేశారు. తమకు కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలని, జీవో నం.51ను సవరించి, మల్టీపర్పస్ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా 5వ తేదీలోగా జీతం వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. కారోబార్, బిల్ కలెక్టర్లకు ప్రత్యేకహోదా కల్పించాలని కోరారు. మెమో నంబర్2021ను వెనక్కి […]