సారథి న్యూస్, రామడుగు: నియంత్రిత పంటల సాగు విధానంపై వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండల ఎంపీడీవో ఆఫీసులో అవగాహన సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. మధ్యాహ్నం 12 గంటలైనా మీటింగ్ షురూ కాకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాలేదని అధికారులు రాకపోవడంతో రైతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.