సారథి, వేములవాడ: నాకా వర్కర్ల ఆధ్వర్యంలో శనివారం ముంబైలోని పశ్చిమ విలేపార్లే నాకా వద్ద మే డే, మహారాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విలేపార్లే నాకా వర్కర్ల సంఘం అధ్యక్షుడు చవల్ రమేష్ మాల మాట్లాడుతూ.. దేశంలో కార్మికులకు, మహిళలకు, ఉద్యోగులకు సమాన వేతనాలు, 14 గంటల నుంచి 8 గంటల వరకు కుదింపు, కార్మిక సంఘాలకు గుర్తింపు తదితర రాజ్యాంగ పరమైన హక్కులను భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్పించారని కొనియాడారు. […]