చెన్నై: లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్.. మళ్లీ రాకెట్ పట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 13 వరకు జరిగే యూఎస్ ఓపెన్ కోసం సన్నాహకాలు మొదలుపెట్టింది. ఇందుకోసం ఇంటి వెనుకాల కొత్తగా టెన్నిస్ మైదానాన్ని ఏర్పాటు చేసుకుంది. త్వరలోనే దానిపై ప్రాక్టీస్ చేయనున్నట్లు సెరెనా వెల్లడించింది. ‘ఈ ఏడాది యూఎస్ ఓపెన్ నిర్వహిస్తున్నందుకు ముందుగా అమెరికా టెన్నిస్ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు. ఈ టోర్నీలో ఆడేందుకు నేను […]