సారథి న్యూస్, నారాయణఖేడ్, కంగ్టి: ప్రమాదాలకు నిలయంగా ఇంటిపై వేలాడుతున్న వైర్లను తొలగించాలని, సంబంధిత కరెంట్ ఆఫీసర్లకు విన్నవించుకుంటున్నా పట్టించుకోవడం లేదని సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం దెగుల్ వాడీ గ్రామస్తులు ఆదివారం మండల కేంద్రంలోని విద్యుత్‌సబ్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. స్తంభాల కింద వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని ఏఈ మోతిరాంకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదని సర్పంచ్ చంద్రవ్వ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా […]
సారథి న్యూస్, నారాయణఖేడ్: ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను కొనడం లేదని మంగళవారం కంగ్టి మండలం దెగుల్ వాడీ గ్రామరైతులు స్థానిక అగ్రికల్చర్ ఆఫీసు ఎదుట ధర్నాచేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటామని గొప్పలు చెప్పి, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని చెప్పి చివరకు చేతికి వచ్చేసరికి కొనడం లేదన్నారు. అనంతరం మార్కెటింగ్‌శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఆందోళనలో రైతులు శ్రీనివాస్ యాదవ్, సంగారెడ్డి, మారుతిరెడ్డి, సంజీవ్, గోపాల్ పాల్గొన్నారు.