దిగ్గజ నటుడు రిషికపూర్ ఇకలేరు బాలీవుడ్ సినీప్రపంచంలో మరో విషాదఘటన చోటుచేసుకుంది. దిగ్గజ నటుడు రిషికపూర్ గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన బుధవారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చేర్పించగా, అక్కడే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భార్య నీతూకపూర్, రిషికపూర్ సోదరుడు రణధీర్ కపూర్, రిషికపూర్ కుమారుడు రణబీర్ కపూర్ ఆస్పత్రి వద్దే ఉన్నారు. రిషి మరణవార్త విని వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ‘మేరా నామ్ […]